లండన్ వీధుల్లో నిక్ తో గొడవ... నడి వీధిలో భర్తను కారు నుంచి దింపేసిన ప్రియాంకా చోప్రా... ఆపై ట్విస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లండన్ వీధుల్లో నిక్ తో గొడవ... నడి వీధిలో భర్తను కారు నుంచి దింపేసిన ప్రియాంకా చోప్రా... ఆపై ట్విస్ట్!

Priyanka Rift with Nick in London Streets
  • 'టెక్ట్స్ ఫర్ యూ'ను చిత్రీకరించే పనిలో ప్రియాంక 
  • అతిథి పాత్రలో నటించనున్న నిక్ జొనాస్
  • లండన్ వీధుల్లో చిత్రీకరణ
2018లో ప్రేమ వివాహం చేసుకున్న మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా, తన భర్త నిక్ జొనాస్ తో గొడవలు పడుతోందంటే నమ్ముతారా? అతనిపై తీవ్ర అసహనానికి గురవుతూ, లండన్ వీధుల్లో వాగ్వాదానికి దిగి, అతన్ని కారు నుంచి దిగిపొమ్మని చెప్పి వెళ్లిపోతుందా? అక్కడ చూస్తున్న వారికి అదంతా నిజమే అనిపించింది. కానీ ఇక్కడో చిన్న ట్విస్ట్...

అదేంటంట్, ప్రియాంక, నిక్ ల మధ్య జరిగిన గొడవ నిజ జీవితంలో కాదండోయ్. తన తదుపరి ప్రాజెక్ట్ 'టెక్ట్స్ ఫర్ యూ'ను చిత్రీకరించే పనిలో ప్రియాంక చాలా బిజీగా ఉండగా, ఇందులో నిక్ కూడా ఓ అతిథి పాత్రలో తళుక్కున మెరవనున్నాడట. అందుకు సంబంధించిన దృశ్యాలనే లండన్ లో తీశారు. కాగా, తనకన్నా దాదాపు పదేళ్లు చిన్నవాడైన నిక్ ను ప్రియాంక ప్రేమించి, ఆపై పెద్దల అంగీకారంతో వివాహమాడిన సంగతి తెలిసిందే.
Priyanka Chopra
Nick Jonas
London

More Telugu News