కళాశాల దరఖాస్తులో బాలీవుడ్ తారలను తల్లిదండ్రులుగా పేర్కొన్న విద్యార్థి
- బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఘటన
- బీఏ సెకండియర్ చదువుతున్న కుందన్ కుమార్
- హాల్ టికెట్ కోసం దరఖాస్తు
- తల్లి సన్నీ లియోనీ, తండ్రి ఇమ్రాన్ హష్మీ అని పేర్కొన్న వైనం
- స్పందించిన సన్నీ లియోనీ
- పిల్లలు కాదు పిడుగులు అంటూ ట్వీట్
అయితే ఈ విషయం బాలీవుడ్ నటి సన్నీ లియోనీ దృష్టికి వెళ్లింది. బాబోయ్, ఈ పిల్లలు మామూలోళ్లు కాదు.. అంటూ స్పందించారు. ఇలాగే కలలు కంటూ ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. సన్నీ స్పందించిందన్న కారణంతో సామాజిక మాధ్యమాల్లో కుందన్ కుమార్ దరఖాస్తు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.