Nivetha Peturaj: రానా 'విరాటపర్వం'లో నివేద పేతురాజ్

  • రానా, సాయిపల్లవి జంటగా 'విరాటపర్వం'
  • ప్రత్యేక పాత్ర చేస్తున్న నివేద పేతురాజ్
  • హైదరాబాదులో తాజా షెడ్యూలు షూటింగ్
  • నక్సలిజం నేపథ్యంలో సాగే సినిమా  
Nivetha Peturaj in Ranas Virataparvam

తమిళ భామ నివేద పేతురాజ్ అటు కథానాయికగానూ.. ఇటు అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రలలోను నటిస్తూ టాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు తాజాగా మరో ఆఫర్ వచ్చింది. రానా దగ్గుబాటి సినిమాలో ఓ కీలక పాత్ర చేసే అవకాశం ఈ భామకు లభించింది. రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న 'విరాటపర్వం' సినిమాలో నివేద ప్రత్యేక పాత్ర చేస్తోంది.

వేణు ఉడుగుల దర్శకత్వంలో నక్సలిజం నేపథ్యంలో ఈ 'విరాటపర్వం' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందే కొంత షూటింగును జరుపుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. రానా, సాయిపల్లవితో పాటు ప్రధాన తారాగణం ఈ షూటింగులో పాల్గొంటున్నారు. తాజాగా ప్రత్యేక పాత్రకు ఎంపికైన నివేద కూడా షూటింగులో జాయిన్ అయింది. సురేశ్ బొబ్బిలి సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ తో కలసి ఎస్.ఎల్.వి. సినిమాస్ సంస్థ అధినేత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

More Telugu News