Tamannaah: ఛాన్స్ వస్తే ఆ యంగ్ హీరోను ముద్దుపెట్టుకుంటానని సమంతకు చెప్పిన తమన్నా.. వీడియో ఇదిగో

tamannah wants to kiss vijay
షార్ట్స్‌లో చూడండి
‘ఆహా’ వేదికగా హీరోయిన్ సమంత యాంకర్‌గా ‘సామ్ ‌జామ్‌’ అనే షో ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో తాజాగా హీరోయిన్ తమన్నా పాల్గొంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో తమన్నాను సమంత పలు ప్రశ్నలు అడిగింది. నో కిస్సింగ్‌ ఆన్‌స్క్రీన్‌ నిబంధనను‌ తీసేస్తే ఎవర్ని ముద్దు పెట్టుకుంటావని తమన్నాను ఆమె అడిగింది.

దీంతో తమన్నా స్పందిస్తూ.. యంగ్ హీరో విజయ్‌ దేవరకొండను ముద్దు పెట్టుకుంటానని తెలిపింది. కాగా, తన మనసు ఎప్పుడైనా గాయపడితే, ఒక్కోసారి తాను రచయిత్రిగా మారి కవితలు రాస్తానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. దీంతో ‘ఎంత ధైర్యం.. నీ గుండెను గాయపరిచింది ఎవరో చెప్పు.. నేను చూసుకుంటా’ అని సమంత సరదాగా చెప్పింది.

తర్వాత అఖిల్ గురించి తమన్నా ఏదో చెప్పింది. అయితే, 'అఖిల్ తమన్నా కంటే వయసులో కాస్త చిన్నవాడు కదా?' అని సమంత ప్రశ్నించింది. దీంతో తమన్నా స్పందిస్తూ ప్రేమకు వయసుతో సంబంధం లేదని తెలిపింది. దీంతో సమంత స్పందిస్తూ.. కావాలంటే తాను మీటింగ్‌ ఏర్పాటు చేస్తానని, వాళ్ల నాన్నతో కూడా మాట్లాడతానని సమంత సరదాగా చెప్పింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది.
   
Go Back to Shorts
Tamannaah
Tollywood
Samantha

More Telugu News