సిక్కు యువకుడిగా సల్మాన్ ఖాన్.. కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల.. వీడియో ఇదిగో
Add ap7am to your home Screen

సిక్కు యువకుడిగా సల్మాన్ ఖాన్.. కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల.. వీడియో ఇదిగో

salman new look goes viral
  • సల్మాన్‌ ఖాన్‌ కొత్త సినిమా ‘అంతిమ్‌’
  • సల్మాన్ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తున్న దృశ్యం విడుదల
  • సిక్కు పోలీసుగా కనపడనున్న సల్మాన్
బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ కొత్త సినిమా ‘అంతిమ్‌’లోని ఫస్ట్‌లుక్ వీడియో విడుదలైంది. సిక్కు యువకుడిగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. షూటింగ్ సందర్భంగా స్టైల్‌గా నడుచుకుంటూ వస్తుండగా తీసిన ఈ వీడియో అభిమానులను అలరిస్తోంది.  

ఈ వీడియోను సల్మాన్‌ ఖాన్‌ బావ ఆయుశ్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. 'అంతిమ్'‌ షురూ అయిందని, అంతిమ్‌ ఫస్ట్‌లుక్ ఇదేనని ఆయన చెప్పాడు. ఈ సినిమాలో ఆయుష్‌ శర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో సల్మాన్‌ సిక్కు పోలీసుగా కనపడనున్నాడు.

ఈ సినిమాను దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ రూపొందిస్తున్నాడు. మరోవైపు, సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా విడుదల కాలేదు. ఇప్పుడు 'భాయ్‌జాన్' షూటింగులో సల్మాన్ బిజీ అయిపోయాడు.
Salman Khan
Bollywood
Viral Videos

More Telugu News