Nagarjuna: యాపిల్ స్టోర్ లో కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి: నాగార్జున

  • ప్రముఖ సంస్థ యాపిల్ పై నాగార్జున విమర్శలు
  • వాళ్ల సర్వీసులు, పాలసీలు సరిగా లేవని వ్యాఖ్య
  • ఇంకా స్పందించాల్సి ఉన్న యాపిల్
Be careful When you buy Apple products from Apple store warns Nagarjuna

అక్కినేని నాగార్జున సినీనటుడిగా, నిర్మాతగానే కాకుండా ఒక వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ వ్యాపార సంస్థపై కూడా మండిపడ్డారు. అంతర్జాతీయంగా ఎంతో పేరును తెచ్చుకున్న యాపిల్ సంస్థపై విమర్శలు గుప్పించారు. ఇండియాలో ఉన్న యాపిల్ స్టోర్లలో ఆ కంపెనీకి చెందిన బ్రాండ్లను కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ ద్వారా ఆయన హెచ్చరించారు.

ఈ మధ్య కాలంలో వాళ్ల సర్వీసెస్, పాలసీలు సరిగా లేవని... వాళ్లకు అనుకూలంగా క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పారు. వారి పాలసీలు చాలా దారుణంగా ఉన్నాయని విమర్శించారు. నాగార్జున చేసిన పోస్టుకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ ఆరోపణలపై యాపిల్ సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది.

More Telugu News