Sensex: కొనుగోళ్ల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits today
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐసీఐఐసీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ తదితర బ్లూ చిప్ కంపెనీ షేర్ల కొనుగోళ్లకు మదుపరులు మొగ్గుచూపడంతో మార్కెట్లు దూసుకుపోయాయి. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 347 పాయింట్లు లాభపడి 45,427కి పెరిగింది. నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకుని 13,356కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (3.28%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.95%), ఐటీసీ (2.78%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.60%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.58%).

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.39%), నెస్లే ఇండియా (-1.36%), టాటా స్టీల్ (-1.14%), బజాజ్ ఫైనాన్స్ (-1.11%), మారుతి సుజుకి (-0.76%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News