Kajal Agarwal: సొంత ఖర్చు లేకుండా.. ఉచితంగా హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన హీరోయిన్ కాజల్!

kajal did not spend money for honeymoon
షార్ట్స్‌లో చూడండి
ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లోని అందాలను ఆస్వాదించి, సముద్ర‌పు అందాల నడుమ భర్తతో కలిసి గడిపి, ఫొటోలు తీసుకుని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు ఇటీవల వైరల్ అయ్యాయి.

హనీమూన్ కోసం ఆమె భారీగా ఖర్చు చేసిందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. సాధారణంగా అక్కడి ఓ హోటల్‌లో ఒక్క రాత్రి ఉండాలంటే రూ.38 లక్షలు ఖర్చు అవుతుంది. కాజల్ తన భర్తతో కలిసి 10 రోజులు ఉంది. అందుకోసం ఆమె దాదాపు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఆమె ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా హనీమూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసినట్లు తెలిసింది.

ఎందుకంటే పర్యాటక ప్రదేశాలను ప్రమోట్ చేసుకోవడం కోసం సెలబ్రిటీలకు అక్కడ ఫ్రీగా పర్యటించేందుకు అక్కడి ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. సెలబ్రిటీలకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే ఈ ఆఫర్ పొందొచ్చు. దీంతో కాజల్ ఉచితంగా హనీమూన్ ఎంజాయ్ చేసిందని తెలిసింది. ఇటువంటి సెలబ్రిటీలకు ఓ హోటల్ రూమ్‌తో పాటు భోజనం ఉచిత విమాన టికెట్లు వంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.
Go Back to Shorts
Kajal Agarwal
Tollywood
marriage

More Telugu News