Praneeta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • రవితేజ సినిమాలో ప్రణీత స్పెషల్ సాంగ్?
  • దుబాయ్ లో షూటింగ్ చేస్తున్న నాగశౌర్య
  • 'హిట్' సీక్వెల్ లో అడవి శేష్  
Praneeta special song in Ravitejas film

*  తాజాగా 'క్రాక్' సినిమాలో నటిస్తున్న రవితేజ త్వరలో రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తాడు. కాగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ప్రముఖ నటి ప్రణీతను తీసుకుంటున్నట్టు సమాచారం.  
*  నాగశౌర్య, రీతువర్మ జంటగా 'వరుడు కావలెను' పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. కొన్ని సన్నివేశాలను, పాటలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
*  విష్వక్ సేన్ హీరోగా శైలేష్ దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'హిట్' సినిమా హిట్టయిన సంగతి విదితమే. ఈ చిత్రానికి సీక్వెల్ నిర్మించడానికి హీరో నాని ప్లాన్ చేస్తున్నాడు. అయితే, ఇందులో విష్వక్ కాకుండా అడవి శేష్ కథానాయకుడుగా నటిస్తాడని తెలుస్తోంది.

More Telugu News