ఇది రాజకీయం కాదు.. అరాచకీయం: అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి ఆగ్రహం
- తెలుగు జాతి ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, పీవీ
- అక్బరుద్దీన్ ఒవైసీ తీరు దుర్మార్గం
- సంకుచిత దృక్పథంతో చూడటం క్షమించరాని విషయం
- ఇంత చౌకబారుగా వ్యవహరించడం పొరపాటు
‘వీరి విషయంలో ఇంత చౌకబారుగా వ్యవహరించడం పొరపాటు. ఇది రాజకీయం కాదు.. అరాచకీయం.. రేపు ఇంకొకరు వచ్చి మరొకరి సమాధులో, విగ్రహాలో కూల్చాలంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఈ పోకడను తీవ్రంగా ఖండిస్తున్నాను.. వీరి విషయంలో మరోసారి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని సోమిరెడ్డి హెచ్చరించారు.