Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్‌!

  • గత 24 గంటల్లో 602 కరోనా కేసులు 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,128
  • 2,51,468 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,433
new 602 COVID19 infections in India

తెలంగాణలో గత 24 గంటల్లో 602 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,015 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,128 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,51,468 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,433 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 11,227 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,942 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 62 కేసులు నిర్ధారణ అయ్యాయి.  
     

More Telugu News