Pawan Kalyan: అమరావతి రైతులపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదు: పవన్ కల్యాణ్

pawan slams on ycp leaders
షార్ట్స్‌లో చూడండి
అమరావతి ఉద్యమకారులపై వైసీపీ నేతల వ్యాఖ్యలు సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆయనతో అమరావతి పరిరక్షణ సమితి నేతలు మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... వైసీపీ నేతల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, బంగారం నగలు ధరించి ఉద్యమం చేయకూడదా? అని ఆయన నిలదీశారు. ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే చేయాలా? అని ప్రశ్నించారు.

అలాగే, ఉద్యమాన్ని ఓ సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదని ఆయన అన్నారు. రాజధానిని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని ఆయన విమర్శించారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన చెప్పారు.  

ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని తనకు బీజేపీ స్పష్టం చేసిందని పవన్ చెప్పారు. అలాగే రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం కూడా అధికారికంగా చెప్పలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తే తమ పార్టీ కార్యాచరణ వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News