Corona Virus: తెలంగాణలో కొత్తగా 1,050 కరోనా కేసులు

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,56,713 
  • 2,38,908 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య మొత్తం 1,401
1050 new corona cases in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో  1,050  కరోనా కేసులు  నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో  నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,736 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,56,713 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,38,908 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,401 కి చేరింది. ప్రస్తుతం 16,404 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 13,867 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 232 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 75 కేసులు నిర్ధారణ అయ్యాయి.

More Telugu News