Chandrababu: చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనంలో సాంకేతిక లోపం.. రోడ్డుపై ఆగిపోయిన వైనం!

  • అమరావతి నుంచి హైదరాబాదుకు వస్తుండగా ఘటన
  • నార్కట్ పల్లి వద్ద ఆగిపోయిన కాన్వాయ్
  • మరో వాహనంలో బయల్దేరిన చంద్రబాబు
Chandrababu convoy stopped on road due to technical problem

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఓ వాహనంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి నుంచి ఆయన హైదరాబాదుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్దకు వచ్చిన తర్వాత 20 నిమిషాల పాటు కాన్వాయ్ ఆగిపోయింది. కాసేపు అక్కడే వేచి చూసిన చంద్రబాబు... ఆ తర్వాత  మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో అక్కడి నుంచి హైదరాబాదుకు బయల్దేరారు. చంద్రబాబు ప్రయాణించే ప్రధాన వాహనం ఇప్పటికే 60 వేల కిలోమీటర్లకు పైగా తిరిగింది. ఈ కారణం వల్లే వాహనంలో సాంకేతిక లోపం తలెత్తుతోంది.

More Telugu News