Jagan: ముస్లిం వేషధారణలో సీఎం జగన్... ఫొటోలు ఇవిగో!

  • నేడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి
  • నివాళులు అర్పించిన సీఎం జగన్
  • సీఎంకు జ్ఞాపిక బహూకరించిన ముస్లిం నేతలు, మతపెద్దలు
CM Jagan pays tributes to Moulana Abul Kalam Azad

భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా అల్ప సంఖ్యాక వర్గాల దినోత్సవం, జాతీయ విద్య దినోత్సవం కూడా జరుపుకోవడం తెలిసిందే. అబుల్ కలామ్ ఆజాద్ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి. ఈ సందర్భంగా ఆ మహనీయుని జయంతి నాడు సీఎం జగన్ ఘన నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో అబుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి అంజలి ఘటించారు.

ఈ క్రమంలో  జాతీయ విద్య, మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలు నిర్వహించగా, ముస్లిం వేషధారణతో సీఎం జగన్ కనువిందు చేశారు. ముస్లిం నేతలు, మతపెద్దలు ఆయనకు జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు కొడాలి నాని, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

More Telugu News