Anasuya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • 'ఖిలాడి' సినిమాలో అనసూయ కీలక పాత్ర
  • హారర్ థ్రిల్లర్ గా రానా దగ్గుబాటి 'ధీరుడు'
  • అమెజాన్ ప్రైమ్ ద్వారా 'మిడిల్ క్లాస్ మెలోడీస్'    
Anasuya special charecter in Ravitejas movie

*  రవితేజ కథానాయకుడుగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. మీనాక్షి దీక్షిత్, డింపుల్ హయతి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం తాజాగా హాట్ యాంకర్ అనసూయను సంప్రదించారట. మరి, ఆమె దీనికి ఓకే చెబుతుందా? అన్నది చూడాలి!  
*  రానా దగ్గుబాటి తాజాగా 'గృహం' ఫేమ్ మిలింద్ డే దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఓకే చెప్పాడు. హారర్ థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రానికి 'ధీరుడు' అనే టైటిల్ని ఖరారు చేశారు. కాగా, ఈ చిత్రం చేతబడుల నేపథ్యంతో కూడిన కథతో తెరకెక్కుతుంది. జనవరి నుంచి షూటింగ్ మొదలవుతుంది.
*  ఆనంద్ దేవరకొండ కథానాయకుడుగా ఎ.వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మిడిల్ క్లాస్ మెలోడీస్' చిత్రం ట్రైలర్ ను నిన్న విజయ్ దేవరకొండ విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ నెల 20న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

More Telugu News