Stock Market: ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Sensex ends 355 points high
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంచి లాభాలను మూటగట్టుకున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్ల అండతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 355 పాయింట్లు లాభపడి 40,616కి పెరిగింది. నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 11,909 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.85%), సన్ ఫార్మా (3.96%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.46%), ఇన్ఫోసిస్ (3.02%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.30%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-1.70%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.64%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.58%), ఎన్టీపీసీ (-0.93%),  ఎల్ అండ్ టీ (-0.89%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News