అతని ఒంటిపై మా రూపాల టాటూలు చూసి కొంచెం బాధపడ్డాను: కేటీఆర్
- సీఎం కేసీఆర్, కేటీఆర్ ల పచ్చబొట్లు వేయించుకున్న కార్యకర్త
- ముగ్ధుడ్నయ్యానన్న కేటీఆర్
- నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యలు
అతడి ప్రేమ తనను ముగ్ధుడ్ని చేసినా, కొంచెం బాధగా అనిపించిందని వివరించారు. పార్టీకి చెందిన ఓ వీరాభిమానిని ఈ విధంగా చూడడం నమ్మశక్యంగా అనిపించలేదని, ఇకపైనా మరింత మెరుగ్గా పనిచేయాలన్న ఉత్సాహం కలుగుతోందని తెలిపారు.
ఈ అంశంపై టీఆర్ఎస్ మీడియా విభాగం కన్వీనర్ సతీశ్ రెడ్డి స్పందిస్తూ.... పచ్చబొట్టు వేయించుకున్న కార్యకర్తను కేటీఆర్ అభినందించినా, ఆపై సున్నితంగా మందలించారని, ఇలాంటి వాటికంటే ప్రజలకు మేలు చేయడంపై దృష్టి సారించాలని హితవు పలికారని వెల్లడించారు.