Sensex: బ్యాంకింగ్ స్టాకుల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex ends 377 points high
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఫైనాన్సియల్, బ్యాంకింగ్ స్టాకుల్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 377 పాయింట్లు లాభపడి 40,522కి పెరిగింది. నిఫ్టీ 122 పాయింట్లు పుంజుకుని 11,889 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (11.95%), నెస్లే ఇండియా (5.84%), ఏసియన్ పెయింట్స్ (5.74%), బజాజ్ ఫైనాన్స్ (4.42%), ఎన్టీపీసీ (4.02%).

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.11%), టీసీఎస్ (-2.03%), ఓఎన్జీసీ (-1.83%), ఇన్ఫోసిస్ (-1.54%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.12%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News