‘నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం’ అంటోన్న పూజా హెగ్డే.. ‘బ్యాచ్‌లర్’ టీజర్ విడుదల

bachelor teaser realeases
  • అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డే జంటగా సినిమా
  • అఖిల్‌కు షాక్ మీద షాక్ ఇస్తోన్న పూజ
  • అన్ని పనులు భర్తే చేయాలని డైలాగు
  • సంక్రాంతికి సినిమా విడుదల
‘నాకు కాబోయే వాడు నా షూస్‌తో సమానం’ అని అంటోంది హీరోయిన్ పూజా హెగ్డే.  అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ టీజర్‌లో హీరోయిన్ డైలాగులు చాలా వెరైటీగా ఉన్నాయి. కాబోయే వాడు ఎలా ఉండాలని అఖిల్ అడిగితే ఆమె అన్నీ రివర్స్ లో సమాధానాలు చెప్పి అఖిల్‌కు షాక్ మీద షాక్ ఇచ్చింది.

అన్ని పనులు భర్తే చేయాలని, జాయింట్ ఫ్యామిలీ అంటే తనకు చిరాకని చెబుతుంది. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టీజర్ దసరా సందర్భంగా విడుదలైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

       
Go Back to Shorts
Akhil
Tollywood
puja hedge

More Telugu News