నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: చిరంజీవి

నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: చిరంజీవి

bathukamma wishes chiru
  • బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్నారు
  • బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది
  • ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం 
తెలంగాణ ఆడపడుచులు అంబరాన్నంటే ఆనందంతో జరుపుకునే బతుకమ్మ పండుగ సంబరాలు నేటితో ముగియనున్నాయి. తొమ్మిది రోజులు వివిధ పేర్లతో గౌరమ్మను పూజించిన తెలంగాణ మహిళలు, చివరి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

‘బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాలతో జరుపుకొంటున్న నా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.  బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. మహిళలు ప్రకృతితో, దైవంతో, పుట్టిన నేలతో మమేకమయ్యే శుభ సందర్భం ఇది. మీరు, మీ కుటుంబసభ్యులు అందరూ ఆనందంగా ఉండాలని   కోరుకొంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.  

తెలంగాణ ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ నాయకురాలు కవిత ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు’ అంటూ  ఓ వీడియో పోస్ట్ చేశారు.
Chiranjeevi
Tollywood
bathukamma

More Telugu News