డాలర్ భాయ్ దొరికాడు.... అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు!

Hyderabad CCS Police arrests Dollar Bhai
  • తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ సంచలనం రేపిన యువతి
  • డాలర్ భాయ్ చెప్పమన్నాడంటూ ఆపై మాటమార్చిన వైనం
  • డాలర భాయ్ ని రిమాండ్ కు తరలించే అవకాశం
ఇటీవల ఓ యువతి తనపై కొందరు సినీ ప్రముఖులు సహా 139 మంది అత్యాచారం చేశారంటూ మీడియా ముందుకు రావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది.

అయితే కొన్నిరోజుల తర్వాత అదే యువతి మాట మార్చి తనతో డాలర్ భాయ్ అనే వ్యక్తి అలా చెప్పమన్నాడంటూ మాట మార్చింది. డాలర్ భాయ్ తన కుటుంబాన్ని అంతమొందిస్తానని బెదిరించాడని, అతడో సైకో అని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది.

ఇప్పుడా డాలర్ భాయ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు అతడ్ని రిమాండ్ కు తరలించే అవకాశాలున్నాయి. కాగా, ఇప్పటికే ఆ యువతి ఫిర్యాదు నేపథ్యంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Dollar Bhai
CCS Police
Arrest
Hyderabad
Tollywood

More Telugu News