rain: మూడు రోజుల పాటు బయటకు రావద్దని హైదరాబాదీలకు అధికారుల హెచ్చరిక

  • తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలు 
  • హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్
  • మరో రెండు రోజుల పాటు వర్షాలు
  • అత్యవసర సేవల కోసం 040 - 211111111  
rain in hyderabad

తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాల ధాటికి అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వరదనీరు రోడ్లపై మోకాలిలోతు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర సేవల కోసం 040 - 211111111, జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ  90001 13667, 97046 01866 కు ఫోన్ చేయాలని చెప్పారు.

 అలాగే, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, విద్యుత్ సమస్యలపై జీహెచ్‌ఎంసీ విద్యుత్‌ శాఖ 94408 13750, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నంబర్లకు ఫోన్ చేయొచ్చని తెలిపారు.

నిన్న పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. చాలా సబ్‌స్టేషన్లలోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో ప్రజలు విద్యుత్ స్తంభాలు, తీగలు ముట్టుకోవద్దని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం 1912, 100కు లేక విద్యుత్‌ శాఖ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 73820 72104, 73820 72106, 73820 7157కు ఫోన్ చేయొచ్చని తెలిపారు.

More Telugu News