Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్.. కొత్తగా 1,811 కేసులు

Media Bulletin on status of positive cases
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,811 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,072 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,346 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,83,025 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,217 కు చేరింది. ప్రస్తుతం 26,104 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 291, రంగారెడ్డి జిల్లాలో 138 కేసులు నమోదయ్యాయి.
   
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News