అన్ని చోట్ల కరోనా కేసులు పెరుగుతుంటే మన దగ్గర మాత్రం అదుపులో ఉన్నాయి: కేటీఆర్
- గత ఆరు నెలలుగా ఆరోగ్యశాఖ అద్భుతంగా పని చేసింది
- కరోనాను నియంత్రించడంలో తెలంగాణ విజయవంతమైంది
- వ్యాధుల పట్ల ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది
ఈ ఆరు నెలల్లోనే కాకుండా గత ఆరేళ్లుగా వైద్య, ఆరోగ్యశాఖ గొప్ప పనితీరును కనపరిచిందని కేటీఆర్ చెప్పారు. మాతాశిశు మరణాల రేటును తగ్గించిందని, ఐసీయూ యూనిట్లు, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించిందని తెలిపారు. సీజనల్ వ్యాధులు, రోగాల పట్ల ప్రజల్లో కూడా అవగాహన పెరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు.