సోమ, మంగళ వారాల్లో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు?
- ఇటీవలే ముగిసిన తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు
- జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణల కోసం ప్రత్యేకంగా మరోసారి సమావేశాలు
- హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు
- శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం
"జీహెచ్ఎంసీ చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు హైకోర్టు సూచించిన మరి కొన్ని అంశాల్లో చట్టాలు చేయాల్సి ఉన్నందున వచ్చే సోమ, మంగళవారాల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనిపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది" అని తెలంగాణ సీఎంవో ప్రకటన చేసింది.