Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల తాజా వివరాలు ఇవీ..!

covid cases in Telangana reached to 204748
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,04,748కి పెరిగింది. అలాగే, నిన్న ఒక్క రోజే కరోనా మహమ్మారి కారణంగా 8 మంది మృతి చెందారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,189 మంది మరణించారు.

గత 24 గంటల్లో 2,239 మంది కోలుకోవడంతో ఈ సంఖ్య 1,77,008కి పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 26,551 కేసులు యాక్టివ్‌గా ఉండగా, వీరిలో 21,864 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 54,277 కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 33,46,472కు పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
Telangana
Active cases
Corona deaths

More Telugu News