Sensex: పెరుగుతున్న కరోనా కేసులు.. మార్కెట్ల లాభాలకు బ్రేక్!

Markets ends with losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్ల రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు... అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ట్రంప్, బైడెన్ ల మధ్య తొలి ప్రెసిడెన్సియల్ డిబేట్ జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్  8 పాయింట్లు నష్టపోయి 37,973కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 11,222 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (3.08%), టీసీఎస్ (2.55%), టాటా స్టీల్ (2.51%), టైటాన్ కంపెనీ (2.48%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.83%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-3.82%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.89%), యాక్సిస్ బ్యాంక్ (-2.82%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.69%), ఎన్టీపీసీ (-2.63%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News