Venu Madhav: సరిగ్గా ఏడాది క్రితం.. గతేడాది సెప్టెంబర్ 25న కన్నుమూసిన వేణుమాధవ్

Septeber 25 is a bad day for Tollywood
షార్ట్స్‌లో చూడండి
ఆగస్టు 5న కరోనా సోకినట్టు నిర్దారణ అయిన తరువాత చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, 40 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, సెప్టెంబర్ 25న కన్నుమూశారన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గత సంవత్సరం ఇదే రోజున జరిగిన మరో విషాదాన్ని తలచుకుంటున్న అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమకు సెప్టెంబర్ 25 దుర్దినంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో హాస్య నటుడిగా తనకంటూ ఎంతో గర్తింపు తెచ్చుకుని, కొన్ని చిత్రాల్లో హీరోగానూ నటించిన వేణు మాధవ్, 2019, సెప్టెంబర్ 25న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వేణు మాధవ్ చనిపోయాడంటే, ఇప్పటికీ నమ్మలేని వారున్నారనడం అతిశయోక్తి కాదు. కాలేయ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ ఆయన ఈ లోకానికి దూరం కాగా, పలువురు సెప్టెంబర్ 25 అచ్చిరాలేదని కామెంట్లు పెడుతున్నారు.
Go Back to Shorts
Venu Madhav
SP Balasubrahmanyam
September 25

More Telugu News