నిన్నటి ఐపీఎల్ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై మండిపడ్డ ప్రీతి జింటా
- కరోనాను సంతోషంగా జయించాను
- ఐదు కరోనా పరీక్షలు హాయిగా పూర్తి చేసుకున్నాను
- నిన్నటి మ్యాచ్‌లో జరిగిన పరిణామాన్ని తట్టుకోలేకపోతున్నాను
- క్రికెట్‌లో టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాలి
తాను కరోనాను సంతోషంగా జయించానని, ఆరు రోజుల హోం క్వారంటైన్‌తో పాటు ఐదు కరోనా పరీక్షలు హాయిగా పూర్తి చేసుకున్నానని చెప్పింది. అయితే, నిన్న చోటు చేసుకున్న ఒక షార్ట్ రన్ తనను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పుకొచ్చింది. క్రికెట్‌లో టెక్నాలజీని ఉపయోగించుకోకపోతే దాని ప్రయోజనం ఏమిటని నిలదీసింది. బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాల్సిన సమయం వచ్చిందని ఆమె చెప్పింది. తాను ఎప్పుడూ ఆటలో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తానని ఆమె తెలిపింది. క్రికెట్ నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని కోరింది. భవిష్యత్‌లో తప్పులు మళ్లీ జరగకుండా చూడాలని చెప్పింది.