‘చలో అమలాపురం’ పిలుపు.. సోము వీర్రాజు సహా బీజేపీ నేతల హౌస్ అరెస్ట్
- అంతర్వేది వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ నేతలు
- అమలాపురంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
- బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న వైనం
దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలు, అనుబంధ మోర్చా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అమలాపురంలో సెక్షన్ 30, 144 విధించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును విజయవాడలో గృహ నిర్బంధం చేశారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులో ఆయన నివాసంలో, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్ రాజును విశాఖపట్టణంలో పోలీసులు నిన్న హౌస్ అరెస్ట్ చేశారు.