కరీనా కపూర్ ను టార్గెట్ చేసిన కంగనా రనౌత్!

Kangana Ranaut targets Kareena Kapoor
  • సుశాంత్, సారా విడిపోవడానికి కరీనానే కారణం
  • తొలి హీరోతో డేటింగ్ చేయవద్దని సారాకు కరీనా చెప్పింది
  • ఆమెకు మీడియా కూడా సహకరించింది
బాలీవుడ్ అగ్రనటి కరీనా కపూర్ పై మరో నటి కంగనా రనౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి కంగన తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ, సుశాంత్, సారా అలీఖాన్ (సైఫ్ అలీ ఖాన్ కూతురు) ఇద్దరూ ప్రేమలో ఉన్నారని... వారిద్దరూ విడిపోవడానికి కరీనానే కారణమని అన్నారు. తన తొలి హీరో సుశాంత్ తో డేటింగ్ చేయవద్దని ఆమె సవతి తల్లి కరీనా కోరిందని చెప్పారు. మీడియా కూడా కరీనాకు సహకరించిందని తెలిపారు. మీడియా, బీటౌన్ ఇద్దరూ కలిసి సుశాంత్, సారా విడిపోయేలా చేశారని ఆరోపించింది. ఈ గ్యాంగ్ తనను కూడా టార్గెట్ చేయడానికి యత్నించిందని చెప్పింది.

ఇటీవలి కాలంలో కంగనా మీడియా హెడ్ లైన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేను, ఆయన కుమారుడు ఆదిత్య థాకరేను టార్గెట్ చేయడం, సినీ నటి ఊర్మిళను పోర్న్ స్టార్ అని విమర్శించడం తదితర విషయాలతో ఆమె సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.
Go Back to Shorts
Kareena Kapoor
Kangana Ranaut
Bollywood
Sara Ali Khan

More Telugu News