Pawan Kalyan: పవన్ తో సురేందర్ రెడ్డి ప్రాజక్ట్.. అధికారిక ప్రకటన!

Surendar Reddy to direct Pawan Kalyan
షార్ట్స్‌లో చూడండి
ఆమధ్య చిరంజీవితో 'సైరా' వంటి భారీ చిత్రాన్ని రూపొందించి ప్రశంసలందుకున్న ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని పవన్ కల్యాణ్ తో చేయనున్నట్టుగా గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ రోజు నిర్మాత అధికారికంగా ప్రకటించడంతో ఈ వార్త వాస్తవమేనని వెల్లడైంది. నేడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఈ ప్రాజక్టును ప్రకటించారు.

ఈ క్రేజీ ప్రాజక్టుకు ప్రముఖ నిర్మాత, పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తారు. తన ఎస్.ఆర్.టి బ్యానర్ పై ఆయనీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన వార్తను నిర్మాత రామ్ ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించారు.

అక్టోబర్ నెలాఖరులో విజయదశమి రోజున ఈ చిత్రం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆమధ్య దర్శకుడిగా మారిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రానికి స్క్రిప్టును అందించనుండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి. నేడు పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన చిత్రాలకు సంబంధించిన ప్రత్యేక ప్రకటనలు ఈ రోజు పలు వెలువడుతున్నాయి.
Go Back to Shorts
Pawan Kalyan
Surendar Reddy
Ram Talluri
Vakkantam Vamshi

More Telugu News