ఆగిపోయిన గోపీచంద్ సినిమా.. అడ్వాన్సు వెనక్కి ఇచ్చేసిన హీరో!
- ప్రస్తుతం సంపత్ నందితో 'సీటీమార్' సినిమా
- బీవీఎస్ఎన్ ప్రసాద్ కు సినిమా ఒప్పుకున్న గోపీచంద్
- ఆమధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న సినిమా
- ఆగిపోవడంతో రెండు కోట్లు వెనక్కి ఇచ్చేసిన గోపీచంద్
ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'సీటీమార్' చిత్రాన్ని చేస్తున్న గోపీచంద్.. ఇటీవల ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్లో ఓ చిత్రం చేయడానికి అంగీకరించాడు. దీనికి తమిళ దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించనున్నట్టు ప్రకటించారు. భారీ బడ్జెట్టుతో ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా నిర్మించనున్నట్టు వార్తలొచ్చాయి. ఆమధ్య ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.
అయితే, ఇంతలోనే ఈ చిత్రం ఆగిపోయినట్టు, నిర్మాత నుంచి అడ్వాన్సుగా తాను తీసుకున్న రెండు కోట్లను గోపీచంద్ తిరిగి ఇచ్చేసినట్టు టాలీవుడ్ లో తాజాగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ చిత్రం ఎందుకు ఆగిపోయిందన్న విషయం మాత్రం ఇంకా వెల్లడికాలేదు.