2 ట్రిలియన్ డాలర్లకు యాపిల్ విలువ... బిలియనీర్ల క్లబ్ లోకి చేరిపోయిన టిమ్ కుక్!
- గత వారంలో 5 శాతం పెరిగిన యాపిల్ విలువ
- దీంతో పెరిగిన టిమ్ కుక్ సంపద
- వివరాలు వెల్లడించిన బ్లూమ్ బర్గ్ ఇండెక్స్
బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం ఆయన సంపద బిలియన్ డాలర్లకు పెరిగింది. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ఆధారంగా ఆయన నికర సంపదను విశ్లేషించామని బ్లూమ్ బర్గ్ తెలిపింది. కాగా, తన సంపదలో అధిక మొత్తాన్ని దానధర్మాలకే వెచ్చిస్తానని టిమ్ కుక్ 2015లోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కోట్ల విలువైన యాపిల్ వాటాలను ఆయన బహుమతిగా ఇచ్చారు. ఎన్నో చారిటబుల్ సంస్థలకు ఆయన సాయపడిన సంగతి తెలిసిందే.