Raviteja: మరో సినిమాకి ఓకే చెప్పిన రవితేజ!

  • ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న రవితేజ 
  • ఇటీవల వరుసగా కొత్త కథలకి గ్రీన్ సిగ్నల్
  • రవితేజ కోసం పూర్తి స్క్రిప్టు పనిలో పడ్డ మారుతి
Raviteja gives nod to Maruti

హీరో రవితేజ మాంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న రవితేజ ఇటీవల వరుసగా కథలు వింటూ నచ్చిన వాటికి వెంటనే ఓకే చెప్పేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు మారుతితో కూడా ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

ఆమధ్య సాయితేజ్ హీరోగా 'ప్రతిరోజూ పండగే' చిత్రాన్ని రూపొందించి హిట్ కొట్టిన దర్శకుడు మారుతి ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. నాని హీరోగా ఓ చిత్రాన్ని చేయనున్నాడంటూ ఇటీవల వార్తలొచ్చినప్పటికీ ఆ ప్రాజక్టు విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

ఇదిలావుంచితే, తాజా సమాచారం ప్రకారం, మారుతి తన తదుపరి చిత్రాన్ని రవితేజతో చేస్తున్నాడు. ఇటీవల రవితేజను కలసి తాను ఆయన కోసం సిద్ధం చేసిన కథను చెప్పాడనీ, రవితేజకు బాగా నచ్చడంతో వెంటనే ఈ ప్రాజక్టుకి ఆయన ఓకే చెప్పేశాడనీ అంటున్నారు. దీంతో మారుతి ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి స్క్రిప్టు తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాడట.    

More Telugu News