ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన బీటెక్ రవి.... బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంపై నిరసన
- సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం
- బీటెక్ రవి సంచలన నిర్ణయం
- చైర్మన్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ పంపిన బీటెక్ రవి
- చంద్రబాబుకు కూడా రాజీనామా లేఖ
మండలి ఆమోదించని బిల్లులను గవర్నర్ ఆమోదించడం రాజ్యాంగ వ్యతిరేక చర్యగా భావించి తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రవి వివరణ ఇచ్చారు. నాడు విభజన సందర్భంగా పార్లమెంటులో చేసిన చట్టాలకు సంబంధించి ఏ అంశమూ మన రాష్ట్రానికి దక్కలేదని, నేడు శాసనమండలికి దక్కిన ప్రాధాన్యం ఎంతో కలచివేసిందని, ఇలాంటి ప్రాధాన్యత లేని చట్టసభలో ఉండడం అనవసరమని భావించి రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చానని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ పదవి లేకపోయినా, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. కాగా, తాను రాజీనామా చేయబోయేముందు చంద్రబాబు అనుమతి తీసుకోలేదని తెలిపారు.