వెబ్ సీరీస్ కోసం కాజల్ మరింత గ్లామర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెబ్ సీరీస్ కోసం కాజల్ మరింత గ్లామర్!

Kajal to act in Quantico Indian version
  • వెబ్ సీరీస్ కి మళ్లిన కాజల్ అగర్వాల్ 
  • ప్రియాంక చోప్రా నటించిన క్వాంటికో సీరీస్
  • క్వాంటికో ఇండియన్ వెర్షన్ లో కాజల్
బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్ త్వరలో ఓ హాట్ క్యారెక్టర్ లో నటించనుంది. ఇన్నాళ్లు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలలో గ్లామర్ తారగా రాణించిన కాజల్ ఇప్పుడు తన గ్లామర్ ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి కూడా విస్తరిస్తోంది. మిగతా తారల్లానే తను కూడా వెబ్ సీరీస్ లో నటించడానికి రెడీ అవుతోంది. అయితే, తను చేసే వెబ్ సీరీస్ లో ఈ చిన్నది బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ని పోషించనుంది.

ఆమధ్య బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో 'క్వాంటికో' అనే సీరీస్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే. అందులో ఆమె హాట్ హాట్ గా కనిపించి సంచలనం సృష్టించింది కూడా. అలాగే ఆమె పెర్ఫార్మెన్స్ కి అక్కడ మంచి ప్రశంసలు కూడా లభించాయి. ఈ వెబ్ సీరీస్ అక్కడ బాగా సక్సెస్ కావడంతో దీనికి ఇండియన్ వెర్షన్ నిర్మించడానికి నెట్ ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తోంది. ఈ సీరీస్ కి ప్రియాంక పాత్రకి కాజల్ అగర్వాల్ ని ఎంచుకున్నారు. సో.. ఈ సీరీస్ ద్వారా కాజల్ మరింత గ్లామర్ ని కురిపిస్తుందన్న మాట!
Kajal Agarwal
Priyanka Chopra
Quantico
Netflix

More Telugu News