Sonu Sood: ఎవరైనా నా బయోపిక్ తీస్తే అందులో నేనే హీరోగా నటిస్తా: సోనూ సూద్

  • లాక్ డౌన్ లో మానవత్వం చాటుకున్న సోనూ
  • వేలమంది వలసజీవులను స్వస్థలాలకు తరలించిన వైనం
  • లాక్ డౌన్ అనుభవాలతో పుస్తకం రాస్తానని వెల్లడి
  • బాలీవుడ్ లో సోనూ బయోపిక్ పై ప్రయత్నాలు!
Sonu Sood responds on his biopic

దేశం నలుమూలలా ఉన్న వలస కార్మికులకు సోనూ సూద్ ఇప్పుడో హీరో. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలసజీవులను సోనూ సూద్ తన సొంత ఖర్చులతో వారి స్వస్థలాలకు తరలించాడు. ఖర్చుకు వెనుకాడకుండా వేలమందిని వారి ఇళ్లకు చేర్చి, వారి ముఖాల్లో ఆనందం చూసిన సోనూ సూద్ బయోపిక్ పై ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తన జీవితంపై సినిమా తీయాలని బాలీవుడ్ ఫిలింమేకర్స్ భావిస్తుండడం పట్ల సోనూ సూద్ స్పందించాడు. ఎవరైనా తన బయోపిక్ తీస్తే అందులో హీరో పాత్రను తానే పోషిస్తానని స్పష్టం చేశాడు. తన జీవితంలోని ఎత్తుపల్లాలు, ఎదురైన అనుభవాలు తనకంటే బాగా ఇతరులకు తెలియవని అన్నాడు. కాగా, లాక్ డౌన్ అనుభవాలతో సోనూ సూద్ ఓ పుస్తకం రాయాలనుందని ఇటీవలే వెల్లడించాడు.

More Telugu News