నిద్రపోతున్న కానిస్టేబుల్‌ను లేపి తీసుకెళ్లి.. మారణాయుధాలతో నరికి, బాణాలతో పొడిచి చంపిన మావోలు!

Maoists killed constable in Chhattisgarh
  • చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో దారుణం
  • సెలవుపై ఇంటికొచ్చిన కానిస్టేబుల్‌
  • కుటుంబ సభ్యులు వేడుకున్నా కనికరించని మావోలు
చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఓ కానిస్టేబుల్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. నిద్రపోతున్న అతడిని లేపి మరీ తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా జంగ్లా పోలీస్ స్టేషన్‌లో సోమరు పోయం (35) అసిస్టెంట్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సెలవులపై ఇటీవల త్వాడలోని తన ఇంటికి వెళ్లాడు. అతడు వచ్చిన విషయం తెలుసుకున్న మావోయిస్టు మిలీషియా సభ్యులు బుధవారం అర్ధరాత్రి పోయం ఇంటికి వెళ్లి నిద్రలేపి బయటకు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు అడ్డుకున్నా ఫలితం లేకుండా పోయింది. బయటకు తీసుకెళ్లిన కానిస్టేబుల్‌ను మారణాయుధాలతో నరికి, బాణాలతో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Chhattisgarh
Bijapur
Maoists
Constable
Killed

More Telugu News