బాలికపై అత్యాచారానికి తెగబడి.. చెబితే చంపేస్తానని బెదిరించిన కానిస్టేబుల్
- తనకు భోజనం తీసుకొచ్చిన బాలికపై కానిస్టేబుల్ లైంగిక దాడి
- రెండు నెలలపాటు బాధను తనలోనే దాచుకున్న బాలిక
- నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు
ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఉమేశ్‌కు తన కుమార్తెతో భోజనం పంపించింది. ఇంటికి వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉమేశ్.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బెదిరిపోయిన బాలిక ఆ విషయాన్ని తనలోనే దాచుకుంది.
ఈ ఘటన తర్వాత ఉమేశ్ ఇంటికి వెళ్లమని తల్లి ఎన్నిసార్లు చెప్పినా వెళ్లేందుకు బాలిక నిరాకరించేది. దీంతో అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమార్తె చెప్పింది విని విస్తుపోయిన తల్లిదండ్రులు నిన్న బాలల హక్కుల సంఘంతోపాటు బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.