చైనా వస్తువులను తగలబెట్టిన తమిళ సినీ దర్శకుడు
- చైనాపై భారతీయుల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం
- చైనా వస్తువులను బహిష్కరిద్దామంటూ క్యాంపెయిన్ కూడా ప్రారంభం
- ఇకపై చైనా వస్తువులను కొనబోనన్న దర్శకుడు శక్తి చిదంబరం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చైనా సైనికులు దురాక్రమణకు పాల్పడ్డారని, మన సైనికులను హతమార్చారని చెప్పారు. చైనా వస్తువులపై నిషేధం విధించాలని... భారతీయులందరూ చైనా ఉత్పత్తులను వాడకుండా జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఇకపై తాను చైనా వస్తువులను కొనుగోలు చేయనని చెప్పారు.