ఇలియానాకు టాలీవుడ్ నుంచి ఆఫర్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలియానాకు టాలీవుడ్ నుంచి ఆఫర్?

Ileana to be cast opposite Nagarjuna
  • కొన్నాళ్లుగా అవకాశాలు లేని ఇలియానా 
  • నాగార్జునతో ప్రవీణ్ సత్తారు యాక్షన్ మూవీ
  • హిందీ సినిమా 'రైడ్'కి రీమేక్ గా నిర్మాణం
  • నాగార్జున సరసన ఇలియానాకు ఛాన్స్
ఒకప్పుడు తెలుగులో ఇలియానా నెంబర్ వన్ కథానాయికగా రాణించింది. అత్యధిక పారితోషికాన్ని కూడా తీసుకుంది. గ్లామర్ పాత్రలు పోషించడంలో ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి కొన్ని సినిమాలు చేసినా అక్కడ పెద్దగా సక్సెస్ అయింది లేదు. అదే సమయంలో తెలుగులో కూడా అవకాశాలు తగ్గిపోయి రెంటికీ చెడ్డ రేవడి అయినట్టు అయింది. ఈమధ్య కాలంలో అయితే, అవకాశాలు బొత్తిగా లేవు. అలాంటి ఇలియానాకు ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అది కూడా అక్కినేని నాగార్జున సరసన నటించే ఛాన్స్ కావడం విశేషం!

'గరుడవేగా' ఫేం ప్రవీణ్ సత్తారు తాజాగా నాగార్జునతో ఓ యాక్షన్ ప్రధాన చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. హిందీలో అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన 'రైడ్' చిత్రానికి ఇది రీమేక్ అంటున్నారు. హిందీ వెర్షన్ కి చాలావరకు మార్పులు చేసి స్క్రిప్టును సిద్ధం చేశారట. ఇక 'రైడ్'లో హీరోయిన్ గా నటించిన ఇలియానానే తెలుగుకి కూడా తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నాడట. ప్రస్తుతం ఆ దిశగా ఇలియానాతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.
Ileana
Nagarjuna
Ajay Devagan
Raid Movie

More Telugu News