Tollywood: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై టాలీవుడ్ ప్రముఖుల స్పందన

Tollywood mourns for Sushant Singh Rajput
షార్ట్స్‌లో చూడండి
కేవలం 34 ఏళ్ల వయసుకే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు నూరేళ్లు నిండాయి! సుశాంత్ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. సుశాంత్ బలవన్మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇక లేడని తెలిసి షాక్ కు గురయ్యాను. అద్భుతమైన ప్రతిభ కలిగి, ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని భావించిన నటుడు ఎంతో త్వరగా వెళ్లిపోయాడు. ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
                                                                        -రామ్ చరణ్

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దిగ్భ్రాంతికరం. ఎంతో టాలెంట్ ఉన్న నటుడు చిన్నవయసులోనే మరణించడం బాధాకరం.
                                                                -జూనియర్ ఎన్టీఆర్

బాలీవుడ్ ఇంత దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఎప్పుడూ చూడలేదు. ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడంలేదు.
                                                              -రామ్ గోపాల్ వర్మ

ఈ వార్త విన్నప్పటినుంచి షాక్ తో చేతులు వణుకుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్తను నమ్మలేకపోతున్నా.
                                                              -రకుల్ ప్రీత్ సింగ్

దిగ్భ్రాంతి కలిగించే విషయం. నోట మాటలు రాని పరిస్థితి ఇది.
                                                              -అనిల్ రావిపూడి
Go Back to Shorts
Tollywood
Sushant Singh Rajput
Suicide
Bollywood

More Telugu News