ప్రముఖ సినిమా కెమెరామెన్ కన్నన్ మృతి
- గుండె సంబంధ సమస్యలతో కన్నుమూసిన కన్నన్
- ఆయన వయసు 69 ఏళ్లు
- చెన్నైలో రేపు అంత్యక్రియలు
కన్నన్ మృతితో చిత్ర పరిశ్రమలో ఆవేదన నెలకొంది. ఒక మంచి వ్యక్తిని కోల్పోయామంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు ఆయన పార్థివదేహాన్ని అల్వార్ పేటలోని ఆయన నివాసం వద్ద ఉంచుతారు. రేపు అంత్యక్రియలను నిర్వహిస్తారు. కన్నన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.