Allu Arjun: కొరటాలతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజక్టు

  • ఎప్పటి నుంచో వినిపిస్తున్న కాంబినేషన్ 
  • బన్నీకి కథ చెప్పిన కొరటాల
  • భారీ బడ్జెట్టుతో నిర్మాణం  
  • 'ఆచార్య', 'పుష్ప'ల తర్వాత సెట్స్ కి  
Koratala Shiva to direct Allu Arjun

ఎప్పటి నుంచో అనుకుంటున్న కాంబినేషన్ ఇప్పుడు సెట్ అవుతోంది. అన్నీ సవ్యంగా కుదిరితే త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతుంది. అదే అల్లు అర్జున్.. కొరటాల శివ కాంబో! వీరిద్దరి కలయికలోనూ సినిమా వస్తుందని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతున్నా, ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

ఈ క్రమంలో ఇటీవల బన్నీని కలసి కొరటాల కథ చెప్పాడనీ, అందుకు సంబంధించిన చర్చలు కూడా ఇద్దరి మధ్యా జరిగాయనీ తెలుస్తోంది. మామూలుగా కొరటాల తన ప్రతి సినిమాలోనూ సామాజిక సందేశం ఉండేలా చూసుకుంటారు. అలాంటి సరికొత్త సందేశంతోనే ఈ కథను కూడా ఆయన తయారుచేసినట్టు, బన్నీకి ఇది బాగా నచ్చినట్టు చెబుతున్నారు.

ఇక కొరటాల ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' సినిమా చేస్తుండగా, సుకుమార్ తో బన్నీ 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజక్టులు పూర్తయ్యాక దీని షూటింగ్ మొదలెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. పైగా, పాన్ ఇండియా చిత్రంగా దీనిని భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి నిర్ణయించారని సమాచారం.

More Telugu News