కరోనా మహా విలయం... చైనానే దాటేసిన మహారాష్ట్ర!
- ఒక్కరోజులో 3 వేలకు పైగా కేసులు
- చైనాతో పోలిస్తే మహారాష్ట్రలో అధిక కేసులు
- రెండున్నర లక్షలను దాటేసిన మొత్తం కేసులు
చైనాలో అధికారిక లెక్కల ప్రకారం ఇంతవరకూ 83,036 కేసులు నమోదయ్యాయన్న సంగతి తెలిసిందే. ఇక దేశం మొత్తం మీద కరోనా కేసుల సంఖ్య రెండున్నర లక్షలను దాటేసింది. మహారాష్ట్ర తరువాత కేసుల విషయంలో తమిళనాడు, ఢిల్లీ ముందు నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే 50 శాతానికి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం.