ఎల్లలు లేని దాతృత్వం... 'నిసర్గ' నేపథ్యంలో 28 వేల మందికి సోనూసూద్ ఆపన్నహస్తం
- అలీబాగ్ వద్ద తీరం దాటిన 'నిసర్గ'
- తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన సోనూ
- 200 మంది అసోం వలస కూలీలకు సాయం
'నిసర్గ' తుపాను ముంచుకు వస్తోందన్న వార్తలతో తన బృందం అప్రమత్తమైందని, తీర ప్రాంత ప్రజల ఆకలి తీర్చడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాల్లోని కాలేజీలు, పాఠశాలలకు తరలించామని సోనూసూద్ మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, 'నిసర్గ' తుపాను కారణంగా 200 మంది అస్సామీ వలస కూలీలు ముంబయిలో చిక్కుకుపోయారని, వారిని షెల్టర్ కేంద్రాలకు తరలించామని చెప్పారు. కాగా, నిసర్గ తుపాను మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద తీరం దాటిన సంగతి తెలిసిందే.