Krish Kapur: బాలీవుడ్‌లో మరో విషాదం.. యువ కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ మృతి

  • బాలీవుడ్‌లో వరుస విషాదాలు
  • 28 ఏళ్ల వయసులో బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించిన క్రిష్ కపూర్
  • నిన్న మధ్యాహ్నం తుది శ్వాస విడిచిన సీనియర్ పాటల రచయిత అన్వర్ సాగర్
Casting director Krish Kapur dies at 28 in Mumbai

బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. యువ క్యాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ (28) మృతి చెందాడు. మెదడులో రక్తస్రావంతో గత నెల 31న ముంబైలో తుదిశ్వాస విడిచినట్టు తాజాగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు వచ్చిన వార్తలను ఆయన మేనమామ సునీల్ భల్లా ఖండించారు.

బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతున్న క్రిష్ కపూర్ సబర్బన్ మీరా రోడ్డులోని తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని, ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని బుధవారం తెలిపారు.  క్రిష్ కపూర్ తన తల్లి, భార్య, ఏడేళ్ల పాపతో కలిసి జీవిస్తున్నాడు. మహేష్‌ భట్‌ నిర్మాతగా వ్యవహరించిన ‘జలేబీ’, కృతి ఖర్బందా నటించిన ‘వీరే కి వెడ్డింగ్’‌ వంటి సినిమాలకు క్రిష్‌‌ కాస్టింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.  

మరోవైపు, సీనియర్ పాటల రచయిత అన్వర్ సాగర్ (70) నిన్న మధ్యాహ్నం మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1990లలో అన్వర్ రాసిన పాటలు ఉర్రూతలూగించాయి. కాగా, బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతుండడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

More Telugu News