jonnavithula ramalingeswara rao: సినీ గేయ రచయిత జొన్నవిత్తులపై అట్రాసిటీ కేసు నమోదు

Atrocity Case filed against Song writer Jonnavithula
షార్ట్స్‌లో చూడండి
సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది. మార్చి 23న ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న జొన్నవిత్తుల ఎస్సీ, ఎస్టీల మనోభావాలు కించపరిచేలా ఓ పద్యం పాడారని, అంటరానితనాన్ని కొనసాగించాలనే అర్థం ఆ పద్యంలో ఉందని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన పాడిన పద్యాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజునే ఓ యూట్యూబ్ చానెల్‌లో అప్‌లోడ్ చేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయ నిపుణుల సలహాల అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
jonnavithula ramalingeswara rao
Tollywood
song writer
case

More Telugu News